తాలా అజిత్ నుండి సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమా "తునివు". తెలుగులో "తెగింపు". హెచ్ వినోద్ డైరెక్షన్లో బ్యాంకు దోపిడీ నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు ఆడియన్స్, క్రిటిక్స్ నుండి మిక్స్డ్ రివ్యూలు వస్తున్నాయి. అయినా కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మ్యాజికల్ కలెక్షన్స్ చేస్తుంది.
ఈ నేపథ్యంలో తాలా కి అంతగా ప్రభావం లేని నార్త్ అమెరికా మార్కెట్ లో తునివు సెన్సేషనల్ కలెక్షన్స్ వసూలు చేస్తుంది. తాజాగా నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద తునివు వన్ మిలియన్ డాలర్ మార్క్ ను చేరుకుంది. దీంతో తాలా అజిత్ నటించిన సినిమాలలో ఈ మార్కు అందుకున్న తొలి చిత్రంగా తునివు రికార్డు సృష్టించింది.