సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న కొత్త చిత్రం "SSMB 28". త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తుండగా, థమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుంది. శ్రీలీల మరొక కథానాయికగా నటిస్తుంది.
తాజాగా SSMB 28 మేకర్స్ నుండి అఫీషియల్ ప్రెస్ నోట్ విడుదలైంది. మహేష్ బాబు - త్రివిక్రమ్ కలయికలో మూడవ సినిమా గా రాబోతున్న ఈ ప్రాజెక్ట్ ఫ్యామిలీ ఎమోషన్స్ తో ముడిపడిన ఒక ఎపిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది. సూపర్ స్టార్ ఇదివరకెన్నడూ కనబడని ఒక న్యూ అవతార్ లో జులాపాల జుట్టు, గడ్డంతో ఈ సినిమాలో కనిపిస్తారు. ఇందుకోసం త్రివిక్రమ్ ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ ను రచించారు. రేపటి నుండి న్యూ షెడ్యూల్ స్టార్ట్ కాబోతుంది... అని విడుదల చేసిన ప్రెస్ మీట్లో మేకర్స్ పేర్కొన్నారు.