ఈనెల 25న విడుదల కాబోతున్న "పఠాన్" సినిమాతో కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నాలుగేళ్ళ విరామం తదుపరి మొదటిసారిగా ప్రేక్షకులను బిగ్ స్క్రీన్ పై పలకరించబోతున్నారు. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో దీపికా పదుకొణె, జాన్ అబ్రహం కీరోల్స్ లో నటిస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం, పఠాన్ మూవీ విడుదలకు ఐదు రోజులు ముందుగా అంటే జనవరి 20 నుండి అడ్వాన్స్ బుకింగ్స్ ను ఓపెన్ చేసేందుకు మేకర్స్ ముహుర్తం ఫిక్స్ చేసారు. IMDB మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ 2023 గా రికార్డు సృష్టించిన పఠాన్ కు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది.