'సుల్తాన్' తో గతేడాది కోలీవుడ్ రంగ ప్రవేశం చేసిన నేషనల్ క్రష్ రష్మికకు ఆ సినిమా ఏమంత కలిసి రాలేదు కానీ, సెకండ్ కోలీవుడ్ మూవీ "వారిసు" తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం వారిసు మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రష్మిక వచ్చే నెల నుండి మోస్ట్ యాంటిసిపేటెడ్ యాక్షన్ డ్రామా పుష్ప 2 షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పుష్ప ది రైజ్ లో శ్రీవల్లి గా నటించి, నర్తించి పాన్ ఇండియా ప్రేక్షకులను విశేషంగా అలరించిన రష్మిక మరోసారి వారి విశేష మన్ననలను అందుకునేందుకు సంసిద్ధమవుతుంది.