పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఖాతాలో సలార్, ప్రాజెక్ట్ కే, ఆదిపురుష్ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే కదా.వీటిలో ఆదిపురుష్ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా, సలార్ మరియు ప్రాజెక్ట్ కే చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి. వీటి తరువాత ప్రభాస్ అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ రెడ్డి వంగ తో "స్పిరిట్" సినిమా చెయ్యనున్నారు. ఈ మేరకు గతేడాదిలోనే అధికారిక ప్రకటన కూడా జరిగింది.
ప్రభాస్ కెరీర్ లో 25వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్ళడానికి రెడీ అవుతుందంట. ప్రస్తుతం సందీప్ రెడ్డి రణ్ బీర్ కపూర్ తో 'యానిమల్' తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నారు. ఆగష్టు 11న ఈ సినిమా విడుదల కాబోతుంది. తదుపరి 'స్పిరిట్' ప్రీ ప్రొడక్షన్ పనులను సందీప్ రెడ్డి స్టార్ట్ చేసి, ఏడాది చివరి కల్లా షూటింగ్ ను స్టార్ట్ చేస్తారట.
![]() |
![]() |