'హిట్ :ది ఫస్ట్ కేస్' ఫేమ్ రుహాని శర్మ నుండి తాజాగా "హర్" అనే సినిమా రాబోతుంది. హర్ లో రుహాని శర్మ మెయిన్ లీడ్ రోల్ లో నటిస్తుంది. ఈ సినిమాకు శ్రీధర్ స్వరాఘవ్ కథ అందించి, డైరెక్షన్ కూడా చేసారు. డబల్ అప్ మీడియా సమర్పిస్తున్న ఈ సినిమాను రఘు సంకురాత్రి, దీప సంకురాత్రి నిర్మించారు. పవన్ సంగీతం అందించారు.
తాజా సమాచారం ప్రకారం, రేపు ఉదయం పది గంటలకు హర్ టీజర్ విడుదల కాబోతుందని మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు. విశేషమేంటంటే, నాచురల్ స్టార్ నాని హర్ టీజర్ ను విడుదల చెయ్యబోతున్నారు.