తన డ్రెస్సింగ్ గురించి సోషల్ మీడియా ద్వారా అశ్లీల కామెంట్ చేసిన వ్యక్తికి రకుల్ ప్రీత్ సింగ్ అంతే ఘాటుగా జవాబిచ్చింది. కొంచెం సంస్కారం నేర్చుకోమని క్లాస్ పీకింది. ఇటీవల కార్ నుంచి దిగుతున్న తన ఫోటోను రకుల్ ప్రీత్ సింగ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌కు ఓ నెటిజన్ అశ్లీల కామెంట్ పెట్టాడు. `కార్‌లో ఏదో సెషన్‌లో పాల్గొన్న రకుల్ ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయింది` అని ఆ వ్యక్తి రకుల్‌ను అవమానించాడు.
ఈ కామెంట్ రకుల్ దృష్టికి వెళ్లడంతో ఆమె అత్యంత ఘాటుగా స్పందించింది. `నాకు తెలిసి మీ అమ్మ కూడా కార్లో చాలా సెషన్స్‌లో పాల్గొని ఉంటుంది. అందుకే నీకు ఈ విషయాలు బాగా తెలిశాయి. ఈ సెషన్‌ల గురించి కాకుండా కొంచెం సంస్కారానికి సంబంధించిన విషయాలు కూడా నేర్పమని మీ అమ్మని అడుగు. ఇలాంటి మనుషులు ఉన్నంత వరకు మహిళలకు రక్షణ ఉండదు. రక్షణ, సమానత్వం అంటూ చర్చలు సాగించడం వల్ల ఉపయోగం ఉండద`ని రకుల్ ట్వీట్ చేసింది.