రజనీకాంత్ కథానాయకుడిగా ‘జైలర్’ సినిమా రూపొందుతోంది. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో ప్రముఖ హాస్యనటుడు, హీరో సునీల్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఆయన లుక్ కు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సునీల్ పాత్ర, బాడీ లాంగ్వేజ్ కూడా డిఫరెంట్ గా ఉండనున్నాయనే సంగతి పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.