నవరస నటనా సార్వభౌముడు, లెజెండరీ నటుడు శ్రీ. నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి ఈ రోజు. ఆ మహనీయుడిని తలచుకుంటూ అశేష ప్రేక్షకలోకం నివాళులు అర్పిస్తున్నారు.
తాజాగా నందమూరి వారసులు, టాలీవుడ్ స్టార్ హీరోలు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఎన్టీయార్ ఘాట్ ను సందర్శించి ఆ కారణ జన్ముడికి ఘననివాళి అర్పించారు.
28 మే, 1923లో కృష్ణాజిల్లా నిమ్మకూరు లో జన్మించిన తారకరామారావు గారు 18 జనవరి, 1996లో 72 ఏళ్ళ వృద్ధాప్యంలో కాలం చేసారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa