గతేడాది బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన సినిమా "ది కాశ్మీర్ ఫైల్స్". అతి చిన్న సినిమాగా, అతి తక్కువ థియేటర్లలో విడుదలైన ఈ సినిమా రోజు రోజుకూ థియేటర్లను, కలెక్షన్లను పెంచుకుంటూ, ఫైనల్ గా 300కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది.
తొంభైల కాలంలో కాశ్మీర్ పండిట్లు ఎదుర్కొన్న అవమానాలు, వారిపై జరిగిన అకృత్యాలు, వారి ఊచకోత నేపథ్యంగా దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ సినిమాను తెరకెక్కించారు. దేశం మొత్తం ఏకగ్రీవంగా మెచ్చిన ఈ సినిమా మరోసారి థియేటర్లకు వచ్చేందుకు రెడీ అవుతుంది. రేపు 'కాశ్మీరీ హిందూ జినోసైడ్ డే' సందర్భంగా కాశ్మీర్ ఫైల్స్ సినిమాను రేపు థియేటర్లలో మరోసారి విడుదల చేసేందుకు సిద్ధం చేశామని పేర్కొంటూ మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
విశేషమేంటంటే, ఈ సినిమా విడుదలై ఏడాది కూడా పూర్తి కాకముందే రీ రిలీజ్ అవుతూ కొత్త రికార్డును సృష్టించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa