'కలర్ ఫొటో'తో సూపర్ పాపులరైన నటుడు సుహాస్ రీసెంట్గా వచ్చిన హిట్ 2 లో క్రూరమైన విలన్గా నటించి తన క్రేజ్ ను మరింత పెంచుకున్నాడు. ఆయన లీడ్ రోల్ లో నటించిన 'రైటర్ పద్మభూషణ్' విడుదలకు సిద్ధంగా ఉండగా, తాజాగా తన నెక్స్ట్ మూవీని ఎనౌన్స్ చేసారు.
సుహాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న చిత్రం ఈ రోజే పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. మేకర్స్ ఈ సినిమాకు "ఆనందరావ్ అడ్వెంచర్స్" అనే యూనిక్ టైటిల్ ను ఫిక్స్ చేసారు. పూజా కార్యక్రమానికి హీరోలు రానా, ఆనంద్ దేవరకొండ, డైరెక్టర్ క్రిష్, రైటర్ BVS రవి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. పోతే, ఈ రోజు నుండే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభమైంది.
ఈ సినిమాతో రామ్ పసుపులేటి డైరెక్టర్ గా పరిచయమవుతున్నారు. Xappie స్టూడియోస్ లో ప్రొడక్షన్ నెంబర్ 4గా రూపొందుతున్న ఈ సినిమాను ఉదయ్ కోలా, విజయ్ శేఖర్, సురేష్ కొత్తింటి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa