సమంత ప్రధానపాత్ర పోషిస్తున్న "శాకుంతలం" నుండి కాసేపటి క్రితమే ఫస్ట్ సింగిల్ 'మల్లికా మల్లికా' లిరికల్ వీడియో పాన్ ఇండియా భాషల్లో విడుదలైంది. మణిశర్మ స్వరకల్పనలో, రమ్య బెహరా గాత్రంలో, చైతన్య ప్రసాద్ సాహిత్యంలో ... ఈ పాట సూథింగ్ మెలోడీగా శ్రోతలను మెస్మరైజ్ చేస్తుంది. ఇక, ఈ పాటలో సమంత స్టన్నింగ్ లుక్స్ ప్రత్యేక ఆకర్షణ.
గుణశేఖర్ దర్శకత్వంలో మైథలాజికల్ ఎపిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ సినిమాలో దేవ్ మోహన్ మేల్ లీడ్ రోల్ లో నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 17న పాన్ ఇండియా భాషల్లో విడుదల కావడానికి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa