నైట్రో స్టార్ సుధీర్ బాబు నటిస్తున్న న్యూ మూవీ "హంట్". నిన్ననే ట్రైలర్ విడుదలై సినిమాపై భారీ అంచనాలను నమోదు చేసింది. మహేష్ సూరపనేని డైరెక్షన్లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన హంట్ లో శ్రీకాంత్, భరత్ నివాస్ కీరోల్స్ లో నటించారు. ఘిబ్రాన్ సంగీతం అందించారు.
జనవరి 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న హంట్ మూవీని ఓవర్సీస్ లో విడుదల చేసేందుకు ప్రముఖ సంస్థ శ్లోక ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ముందుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు హంట్ మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.