టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన 'మిరపకాయ్' చిత్రం ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాను రీరిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. రవితేజ జన్మదినం సందర్భంగా జనవరి 26న 4K లో థియేటర్లలో రీరిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. దీంతో మాస్ మహారాజా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అయితే రవితేజ ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాతో పాటు మెగాస్టార్ తో కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా ”వాల్తేరు వీరయ్య” కూడా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ దిశగా దూసుకు పోతుంది.ఇప్పటికే 100 కోట్లకు పైగానే రాబట్టింది.ఈ సినిమాలో రవితేజ తన యాక్టింగ్ తో మరోసారి మెప్పించాడు.