బీవీ నందిని రెడ్డి దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, కేరళ కుట్టి నిత్యమీనన్ జంటగా నటించిన చిత్రం "అలా మొదలైంది". జనవరి 21, 2011లో విడుదలైన అలా మొదలైంది విడుదలై నేటితో పన్నెండేళ్ళు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా మేకర్స్ నుండి స్పెషల్ పోస్టర్ విడుదలైంది.
రొమాంటిక్ కామెడీ చిత్రంగా రూపొందిన అలా మొదలైంది సినిమాకు గానూ నందినీ రెడ్డి గారు బెస్ట్ డైరెక్టర్ గా నంది అవార్డును, సైమా అవార్డులను అందుకున్నారు. కళ్యాణి మాలిక్ అందించిన సంగీతం ఈ క్లాసిక్ క్రేజీ లవ్ స్టోరీని మరింత ప్రత్యేకంగా మార్చింది. శ్రీ రంజిత్ మూవీస్ బ్యానర్ పై KL దామోదర్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.
ఆశిష్ విద్యార్ధి, రోహిణి, స్నేహ ఉల్లాల్, స్నిగ్ధ, మిర్చి హేమంత్ తదితరులు కీరోల్స్ లో నటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa