టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ వక్కంతం వంశీ డైరెక్షన్లో ఒక మూవీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది.
తాజా సమాచారం ప్రకారం, నితిన్ ఈ రోజు ఉదయం హైదరాబాద్లోని మణికొండ ప్రాంతంలో పాపులర్ ఫుడ్ చైన్ అయినటువంటి 'బాబాయ్ హోటల్' యొక్క న్యూ బ్రాంచిని ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యం నితిన్ ప్రత్యేక బహుమతితో సత్కరించింది. నితిన్ తో పాటుగా ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి, డైరెక్టర్ వెంకీ కుడుముల కూడా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa