బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అప్ కమింగ్ మూవీ "కిసీ కా భాయ్ కిసీ కీ జాన్". ఈ సినిమాను ఫర్హాద్ సంజి డైరెక్ట్ చేస్తుండగా, సల్మాన్ ఖాన్ నిర్మిస్తున్నారు. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. విక్టరీ వెంకటేష్, జగపతి బాబు స్పెషల్ రోల్స్ లో నటిస్తున్నారు. తాజా సమాచారం మేరకు, జనవరి 25వ తేదీన ఈ మూవీ టీజర్ విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఈమేరకు అధికారిక ప్రకటన వెలువడింది.