కొరటాల శివ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ "ఎన్టీఆర్ 30" సినిమాలో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్నట్లు సమాచారం.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఫిబ్రవరి మొదటి వారంలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని స్టంట్ కొరియోగ్రాఫర్‌లు రామ్ మరియు లక్ష్మణ్ ఉత్కంఠభరితమైన యాక్షన్ సీక్వెన్స్‌ని ప్లాన్ చేస్తున్నారని ఫిలిం ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ ఇప్పటికే ఈ సినిమా కోసం 10 కిలోల కంటే ఎక్కువ బరువు తగించినట్లు సమాచారం. ఏప్రిల్ 2024లో సినిమాను విడుదల చేసేందుకు మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి యువసుధ ఆర్ట్స్ బ్యానర్ ఎఈ సినిమాని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa