వెంకీ అట్లూరి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఒక సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. తెలుగు ద్విభాషా సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రానికి తమిళంలో "వాతి" అని తెలుగులో "సర్" టైటిల్ ని ప్రకటించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 17, 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా అప్డేట్ ప్రకారం, ఈ చిత్రం యొక్క ఆడియో లాంచ్ ఫిబ్రవరి 4న జరుగుతుంది అని సమాచారం. అయితే, ప్రొడక్షన్ టీమ్ నుండి దీని గురించి ఎటువంటి సమాచారం లేదు కానీ అయితే ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సినిమాలో మలయాళ నటి సంయుక్తా మీనన్ కథానాయికగా నటిస్తుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్య దేవర నాగవంశీ మరియు సాయి సౌజన్య సంయుక్తంగా "సర్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు.