ఉన్నిముకుందన్ లీడ్ రోల్ లో నటించిన చిత్రం "మాలికాపురం". డిసెంబర్ 30న మలయాళంలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తెలుగులో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రముఖ గీతా ఫిలిమ్స్ డిస్ట్రిబ్యూషన్స్ సంస్థ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. రేపే ఈ మూవీ ఇరు తెలుగు రాష్ట్రాలలో విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
విష్ణు శశి శంకర్ డైరెక్షన్లో యాక్షన్ అడ్వెంచరస్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలనుకునే ఎనిమిదేళ్ల ఒక చిన్నారి చేసిన యాత్ర నేపథ్యంతో తెరకెక్కింది.