నందమూరి కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా "అమిగోస్". రాజేంద్ర రెడ్డి డైరెక్షన్లో డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా నుండి రీసెంట్గా టీజర్ విడుదలై సినిమాపై మంచి అంచనాలను ఏర్పరిచింది.
ఇటీవల విడుదలైన ఫస్ట్ సింగల్ 'ఎకా ఎకా' ఫ్రెండ్ షిప్ సాంగ్ కు ఆడియన్స్ నుండి డీసెంట్ రెస్పాన్స్ అందుకుంటుంది. తాజాగా అమిగోస్ నెక్స్ట్ సింగిల్ అప్డేట్ ను ఈ రోజు సాయంత్రం 05:09 గంటలకు ఇవ్వబోతున్నట్టు కాసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
పోతే, ఈ సినిమా ఫిబ్రవరి 10వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది.