టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో శర్వానంద్ కు ఈ రోజు నిశ్చితార్ధం జరిగింది. రక్షిత రెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగినిని శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నారు. ఇరువురి కుటుంబ సభ్యులు, స్నేహితులు, శ్రేయోభిలాషుల సమక్షంలో సింపుల్ అండ్ స్వీట్ గా వీరిద్దరి ఎంగేజ్మెంట్ సెరిమోనీ జరిగింది.
శర్వానంద్ ఎంగేజ్మెంట్ కు మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ్, ఉపాసన హాజరై, కాబోయే దంపతులకు బెస్ట్ విషెస్ తెలియచేసారు. ఇంకా ఈ కార్యక్రమానికి డైరెక్టర్ క్రిష్, హీరో నితిన్, సింగర్ స్మిత హాజరయ్యారు. రూమార్డ్ లవ్ బర్డ్స్ సిద్దార్థ్, అదితి రావ్ హైదరి ఈ ఈవెంట్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.