యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ చివరిసారిగా 'గుర్తుందా సీతాకాలం' సినిమాలో కనిపించారు. సత్య దేవ్ తన 26వ చిత్రాన్ని ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ చిత్రానికి 'జీబ్రా' అనే టైటిల్ ని పెట్టినట్లు మూవీ మేకర్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ఇదే విషయాన్ని తెలియజేసేందుకు ఆసక్తికర టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు.
క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. పుష్ప నటుడు డాలీ ధనంజయ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో సత్యరాజ్, జెన్నిఫర్ పిసినాటో, సత్య ఆకల, మరియు సునీల్ ముఖ్య పాత్రలు పోషించారు.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీత దర్శకుడు. పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై SN రెడ్డి, బాల సుందరం మరియు దినేష్ సుందరం ఈ పాన్-ఇండియన్ మూవీని నిర్మిస్తున్నారు.