యంగ్ హీరో శివ కందుకూరి నటిస్తున్న కొత్త చిత్రం "భూతద్దం భాస్కర్ నారాయణ". ఇందులో రాశి సింగ్ హీరోయిన్గా నటిస్తుంది. పురుషోత్తం రాజ్ డైరెక్షన్లో మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్, విజయ సరాగ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీచరణ్, విజయ్ బుల్గనిన్ సంగీతం అందిస్తున్నారు.
తాజాగా రేపు ఈ మూవీ టీజర్ విడుదల కాబోతుంది. గతంలో విడుదలైన గ్లిమ్స్ వీడియోలకు ఆడియన్స్ నుండి మంచి స్పందన లభించింది. పోతే, ప్రపంచవ్యాప్తంగా మార్చి 31వ తేదీన థియేటర్లలో ఈ మూవీ విడుదల కాబోతుంది.