బ్లాక్ బస్టర్ 'మాస్టర్' కాంబో మరోసారి చేతులు కలపబోతున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ - హీరో విజయ్ కలయికలో ఒక సినిమా రూపొందుతుంది. మాస్టర్ ఘనవిజయంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
తాజా బజ్ ప్రకారం, ఈ సినిమాలో చియాన్ విక్రమ్ విలన్గా నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఐతే, గతంలో ఈ మూవీ విలన్గా హీరో విశాల్ నటిస్తున్నట్టు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. మరి, ఈ విషయంలో క్లారిటీ రావాలంటే, అఫీషియల్ అప్డేట్ వచ్చేంతవరకు ఎదురుచూడాల్సిందే.