అనుదీప్ దర్శకత్వంలో తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన 'ప్రిన్స్' మూవీ అక్టోబర్ 21న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయింది. కామెడీ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో వచ్చిన ఈ సినిమాలో శివకార్తికేయన్ సరసన ఉక్రెయిన్ బ్యూటీ మెరీనా ర్యాబోషప్కా జోడిగా కనిపించనుంది. సత్యరాజ్, ప్రేమి, సూరి, ఆనందరాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా తెలుగు వెర్షన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ జనవరి 29, 2023న మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ మా ఛానెల్‌లో ప్రదర్శించబడుతుందని సమాచారం.
సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, సురేష్ బాబుతో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ పతాకాలపై ఈ చిత్రాన్ని నిర్మించారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. తమిళ-తెలుగు మూవీకి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందించారు.