నటి, డ్యాన్సర్ రాఖీ సావంత్ తల్లి జయ భేదా చనిపోయింది. బ్రెయిన్ క్యాన్సర్తో సుదీర్ఘ కాలంగా పోరాడుతూ శనివారం కన్నుమూసింది. క్యాన్సర్ తీవ్రం కావడంతో జయబేధా ఆసుపత్రిలో చేరింది. పరిస్థితి నానాటికీ విషమించింది. క్యాన్సర్ క్రమంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తులకు వ్యాపించింది. కొన్ని రోజుల క్రితం ఈ విషయాన్ని రాఖీ సావంత్ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపింది. ఆమె కోసం ప్రార్థించాలని అభిమానులను కోరింది.