మజిలీ చిత్రంలో చైతు ప్రేయసిగా నటించిన యంగ్ బ్యూటీ దివ్యాంశ కౌశిక్ తాజాగా హాట్ కామెంట్స్ చేసింది. సమంత, నాగ చైతన్య విడిపోయాక ఎవరి వర్క్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అయితే వీరిద్దరి గురించి రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా నాగ చైతన్య ప్రస్తుతం రిలేషన్ షిప్ లో ఉన్నాడు అంటూ ప్రచారం జరుగుతోంది. కానీ చైతు మాత్రం ఈ రూమర్స్ కి స్పందించడం లేదు. ప్రస్తుతం చైతు వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా మజిలీ చిత్రంలో చైతు ప్రేయసిగా నటించిన యంగ్ బ్యూటీ దివ్యాంశ కౌశిక్ తాజాగా హాట్ కామెంట్స్ చేసింది. సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్ తో ఆకట్టుకునే దివ్యాంశ మజిలీ చిత్రంలో మెప్పించింది. ఈ చిత్రంలో చైతు, దివ్యాంశ కెమిస్ట్రీ బాగా కుదిరింది. అయితే తాజాగా దివ్యాంశ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చైతు గురించి తెలిపింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నట్లు, పెళ్లి చేసుకోబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. దీనిపై దివ్యాంశ స్పందిస్తూ.. ఐ లవ్ చైతు, అతనంటే నాకు ఇష్టం, క్రష్ కూడా ఉంది. కానీ మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు అని క్లారిటీ ఇచ్చింది.