తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ దశదిశలా వ్యాపింపజేసిన కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారు నిన్న రాత్రి శివైక్యం అయ్యారు. దీంతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాదపు ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విశ్వనాథుని మృతిపై దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులకు సానుభూతిని ప్రకటిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కళాతపస్వి శివైక్యం చెందడం పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రెస్ నోట్ విడుదల చేసారు. 'కళా తపస్వి' గా ప్రేక్షకుల మన్ననలు పొందిన విశ్వనాథ్ గారి చిత్రాలు... తెలుగుతెరపై మెరిసిన స్వర్ణకమలాలని, నటుడిగా ఆయన పోషించిన పాత్రలు సినిమాలకు నిండుదనాన్ని తీసుకొచ్చాయని, తెలుగు సినిమా కీర్తిప్రతిష్టలు ఇనుమడింపజేసిన శ్రీ విశ్వనాథ్ గారి స్థానం భర్తీ చెయ్యలేనిదని, వారి కుటుంబానికి, అభిమానులకు తన తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు.