కళాతపస్వి కాశీనాథుని విశ్వనాథ్ గారు నిన్న రాత్రి శివైక్యం చెందిన విషయం తెలిసిందే. ఆయన లేని లోటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మాత్రమే కాదు భారతీయ చిత్రానికే తీరనిది. విశ్వనాథ్ గారి మృతి పట్ల ప్రముఖ సీనియర్, యంగ్ నటీనటులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ. నరేంద్ర మోడీ గారు కూడా విశ్వనాథుని శివైక్యం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ స్పెషల్ ట్వీట్ చేసారు. 'శ్రీ. కె. విశ్వనాథ్ గారి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాను. అతను సినీప్రపంచంలో ఒక దిగ్గజం. సృజనాత్మక దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, సినీలోకంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. వివిధ ఇతివృత్తాలతో తీసిన అతని సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి. అతని కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను. ఓం శాంతి' అని మోడీజీ పేర్కొన్నారు.