ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుల్కర్ 'కింగ్ ఆఫ్ కోత' న్యూ పోస్టర్ రిలీజ్ 

cinema |  Suryaa Desk  | Published : Fri, Feb 03, 2023, 12:37 PM

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందుతున్న చిత్రం "కింగ్ ఆఫ్ కోత". ఈ సినిమాకు దుల్కర్ క్లోజ్ ఫ్రెండ్ అభిలాష్ జోషే దర్శకుడు. జీ స్టూడియోస్, వే ఫేరర్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
దుల్కర్ కెరీర్లో బిగ్ బడ్జెట్ గ్యాంగ్స్టర్ యాక్షన్ ఫిలింగా రూపొందుతున్న ఈ సినిమాలో దుల్కర్ తో పాటుగా షబ్బీర్ కళ్లరక్కల్, గోకుల్ సురేష్, ఐశ్వర్య లక్ష్మి లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. జేక్స్ బిజోయ్,షాన్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. 


లేటెస్ట్ గా ఈ సినిమా నుండి న్యూ అండ్ ఇంటెన్స్ పోస్టర్ విడుదలైంది. ఇందులో దుల్కర్ ఫుల్ మాస్ అండ్ రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇప్పటివరకు రొమాంటికల్ లవ్ క్యారెక్టర్స్ లో దుల్కర్ కనిపించగా, ఈ సినిమాలో ఫుల్ మేకోవర్ అయ్యి, ఫుల్ మాస్ అవతార్ లో కనిపిస్తూ ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.


పోతే, ఈ మూవీ ఓనం 2023 కానుకగా విడుదల కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com