కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొందుతున్న 'తలపతి67' జనవరి 2 నుండి షూటింగ్ ప్రారంభించింది. మొదటి షెడ్యూల్ ను సక్సెస్ఫుల్ గా పూర్తి చేసిన తలపతి 67 చిత్రబృందం ఈ రోజు నుండి కాశ్మీర్ లో నెక్స్ట్ న్యూ షెడ్యూల్ మొదలెట్టింది. ఈ మేరకు మేకర్స్ అఫీషియల్ వీడియోను విడుదల చేసి, ఎనౌన్స్ చేసారు. రెండ్రోజుల క్రితమే తలపతి 67 చిత్రబృందం మొత్తం ఒక ప్రైవేట్ జెట్ ఫ్లైట్ లో కాశ్మీర్ కి బయలుదేరి వెళ్లారు.
త్రిష, ప్రియా ఆనంద్, సంజయ్ దత్, అర్జున్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. 7స్క్రీన్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుంది.