పాన్ ఇండియా భాషల్లో ఈరోజు గ్రాండ్ గా విడుదలైన మైఖేల్ చిత్రం నుండి కాసేపటి క్రితమే తెలుగు ఆడియో జ్యూక్ బాక్స్ విడుదలైంది. సామ్ సీఎస్ స్వరకల్పనలో రూపొందిన అద్భుతమైన మెలోడీ గీతాలు, గూజ్ బంప్స్ తెప్పించే టైటిల్ థీమ్ ..ఇప్పుడు అన్ని వేళలా, అన్ని మ్యూజిక్ ప్లాట్ ఫార్మ్స్ లో వినొచ్చన్న మాట.
రంజిత్ జయకొడి డైరెక్షన్లో పీరియాడికల్ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో సందీప్ కిషన్, దివ్యాన్ష కౌషిక్ హీరోహీరోయిన్లుగా నటించారు. విజయ్ సేతుపతి, గౌతమ్ మీనన్, వరలక్ష్మి శరత్ కుమార్, వరుణ్ సందేశ్ కీరోల్స్ లో నటించారు. భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు.