రేపు విడుదల కాబోతున్న "బుట్టబొమ్మ" చిత్రం నుండి కాసేపటి క్రితమే ఫస్ట్ లిరికల్ సాంగ్ 'అమ్మాడి గుమ్మాడి' విడుదలైంది. ఈ పాటను స్వీకర్ అగస్తి కంపోజ్ చెయ్యగా, అనురాగ్ కులకర్ణి, నూతన మోహన్ ఆలపించారు. కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు.
బుట్టబొమ్మతో చైల్డ్ ఆర్టిస్ట్ అనిఖా సురేంద్రన్ హీరోయిన్ గా వెండితెరకు పరిచయం కాబోతుంది. ఈ సినిమాలో అర్జున్ రామ్ దాస్, సూర్య వసిష్ఠ, నవ్య స్వామి కీరోల్స్ లో నటిస్తున్నారు. నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.