తలపతి అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్న తలపతి 67 మూవీ టైటిల్ కాసేపటి క్రితమే రివీల్ అయ్యింది. ఈ మేరకు మేకర్స్ టైటిల్ రివీల్ ప్రోమోను విడుదల చేసారు. ఈ సినిమాకు "లియో"అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చెయ్యగా, దీనికి 'బ్లడీ స్వీట్' అనేది ట్యాగ్ లైన్. తాజాగా విడుదలైన టైటిల్ ప్రోమోలోనే మేకర్స్ రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేసి, ప్రేక్షకాభిమానులను మరింత ఆశ్చర్యపరిచారు. పోతే, ఈ చిత్రం అక్టోబర్ 19 వ తేదీన తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషలలో విడుదల కాబోతుంది.
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం కాశ్మీర్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఇందులో త్రిష, ప్రియా ఆనంద్, సంజయ్ దత్, అర్జున్ కీరోల్స్ లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa