నిన్న విడుదలైన "రైటర్ పద్మభూషణ్" చిత్రానికి ఆడియన్స్, క్రిటిక్స్ నుండి యూనానిమస్ గా సూపర్ పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆడియన్స్ డిమాండ్ మేరకు వరల్డ్ వైడ్ గా రైటర్ పద్మభూషణ్ షోలు పెంచడం జరిగిందని పేర్కొంటూ మేకర్స్ స్పెషల్ ఎనౌన్స్మెంట్ చేసారు.
సుహాస్, టీనా శిల్పారాజ్ జంటగా నటించిన ఈ సినిమాను షణ్ముఖ ప్రశాంత్ డైరెక్ట్ చేసారు. లహరి ఫిలిమ్స్, చాయ్ బిస్కట్ ఫిలిమ్స్ సంయుక్త బ్యానర్ లపై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహరన్ నిర్మించారు. ఆశిష్ విద్యార్ధి, రోహిణి కీలకపాత్రల్లో నటించారు.