సిద్ధార్థ్ మల్హోత్ర, కియారా అడ్వాణీపై కంగనా రనౌత్ ప్రశంసలు కురిపించింది. ఈ మేరకు వారిద్దరి ఫోటోలు షేర్ చేస్తూ ‘ఈ జోడీ ఎంత చూడముచ్చటగా ఉందో.. సినిమా పరిశ్రమలో చాలా అరుదుగా నిజమైన ప్రేమ కనిపిస్తుంది. వాళ్లిద్దరిని చూస్తుంటే మనసుకు ఎంతో సంతోషంగా ఉంది’’ అని పేర్కొంది. కాగా, ఫిబ్రవరి 6న సిద్ధార్థ్, కియారాల వివాహం జరగనుందని సమాచారం. ఈ వేడుకకు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరవనున్నారు.