బాలీవుడ్ స్టార్ హీరో కియారా అద్వానీ వివాహంపై ఎప్పటికప్పుడు తాజా పుకార్లు పుడుతూనే ఉన్నాయి. అవి హాట్ టాపిక్ గా నిలుస్తూనే ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా, కియారా డేటింగ్ లో ఉన్నారన్న విషయం తెలిసిందే. తాజాగా కియారా సిద్దార్థ్ మల్హోత్రాతో ఫిబ్రవరి 6వ తేదీన ఏడడుగులు నడవబోతుందని, వీరి వివాహం రాజస్థాన్, జైసల్మేర్ లో జరగబోతుందని ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్న విషయం. వీటిని బలపరుస్తూ, కాసేపటి క్రితమే కియారా తన కుటుంబంతో కలిసి జైసల్మేర్ బయలుదేరి వెళ్ళింది. ఈ మేరకు ముంబై ఎయిర్పోర్ట్ కి చేరుకున్న ఆమె ఫోటోలు నెట్టింట వీరవిహారం చేస్తున్నాయి.