మయోసైటిస్ నుంచి కోలుకుంటోన్న నటి సమంత ఇప్పుడిప్పుడే షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. ‘గట్టిగా ఊపిరి పీల్చుకో. త్వరలో అన్నీ చక్కబడతాయని నేను నీకు మాటిస్తున్నా పాప. గత 7, 8 నెలలుగా అత్యంత ఇబ్బందికరమైన రోజులను చూస్తూ ముందుకు సాగావు. వాటిని మర్చిపోవద్దు. అన్నింటినీ తట్టుకుని ధైర్యంగా అడుగులేశావు. నీ విషయంలో ఎంతో గర్వంగా ఉన్నా. ధైర్యంగా సాగిపో.’ అని ఇన్ స్టాలో రాసుకొచ్చారు.