గురువారం రాత్రి తొమ్మిది గంటల నుండి ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన పవర్ స్టార్మ్ ఎపిసోడ్ కి ప్రేక్షకాభిమానుల నుండి థండరింగ్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటికే 100మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ మార్క్ ను చేరుకొని, అన్స్టాపబుల్ గా దూసుకుపోతున్న పవర్ ఫినాలే రెండు పార్ట్ లుగా స్ట్రీమింగ్ కాబోతున్న విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో రెండో పార్ట్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేసేందుకు ఆహా సంస్థ రంగం సిద్ధం చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - నటసింహం నందమూరి బాలకృష్ణ గార్ల మధ్య జరిగిన క్రేజీ చిట్ ఛాట్ యొక్క సెకండ్ ఎపిసోడ్ రేపు విడుదల కాబోతుందని కాసేపటి క్రితమే ఆహా అఫీషియల్ పోస్టర్ విడుదల చేసింది.