నిన్న సాయంత్రం విడుదలైన అమిగోస్ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి చాలా మంచి స్పందన వస్తుంది. యూట్యూబ్లో 5 మిలియన్ కు పైగా వ్యూస్, 123కే లైక్స్ తో ట్రెండింగ్ వీడియోస్ లో ఒకటిగా దూసుకుపోతుంది. టీజర్ తో ఒక్కసారిగా ప్రేక్షకుల అటెన్షన్ గ్రాస్ప్ చేసిన ఈ మూవీ ఆపై లిరికల్ సాంగ్స్ తో క్రేజ్ పెంచుకుంది. ఇక, నిన్న విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను నమోదు చేసింది.
రాజేంద్ర రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు కాగా, ఘిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్రహ్మాజీ, సప్తగిరి కీరోల్స్ లో నటిస్తున్నారు. పోతే, వచ్చే శుక్రవారమే అమిగోస్ మూవీ థియేటర్లకు రాబోతుంది.