మహాశివరాత్రి కానుకగా ఈ నెల 17న థియేటర్లలో సందడి చెయ్యడానికి సిద్ధమవుతున్న సినిమాలలో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన "వినరో భాగ్యము విష్ణుకథ" ఒకటి. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో సస్పెన్స్ లవ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో కాశ్మీర పరదేశి హీరోయిన్ గా నటించింది. చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు.
టీజర్, లిరికల్ సాంగ్స్ తో ప్రేక్షకులలో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసిన VBVK మూవీ నుండి రేపే ట్రైలర్ విడుదల కాబోతుంది. రేపు సాయంత్రం 05:04 నిమిషాలకు VBVK ట్రైలర్ విడుదల కాబోతుందని, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ రాబోతున్నారని పేర్కొంటూ మేకర్స్ ప్రత్యేకమైన వీడియోను విడుదల చేసి ఆడియన్స్ కి తెలియచేసారు.
![]() |
![]() |