కొత్త చిత్రాలను చూసి, నచ్చితే సదరు చిత్రబృందాన్ని అభినందిస్తూ ట్వీట్ చెయ్యడం మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ఉన్న గొప్ప అలవాట్లలో ఒకటి. తాజాగా విడుదలైన రైటర్ పద్మభూషణ్ సినిమాను చూసిన మహేష్ చిత్రబృందానికి హార్టీ కంగ్రాట్యులేషన్స్ తెలుపుతూ ట్వీట్ చేసారు. సినిమా చూస్తూ చాలా ఎంజాయ్ చేసానని, ఇదొక హార్ట్ వార్మింగ్ ఫిలిం అని, ముఖ్యంగా క్లైమాక్స్ అద్భుతంగా ఉందని, కుటుంబంతో కలిసి ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది అని, సుహాస్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారని మహేష్ ట్వీట్ చేసారు.
ఈ సందర్భంగా మహేష్ కి కృతజ్ఞతలు తెలుపుతూ రైటర్ చిత్రబృందం సంతోషాన్ని వ్యక్తం చేసింది.