నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి". నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల గారు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. రీసెంట్గానే ఫస్ట్ లుక్ విడుదలయ్యింది.
లేటెస్ట్ ఈ సినిమా నుండి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ నెల 9వ తేదీన టీజర్ ను విడుదల చెయ్యబోతున్నట్టుగా స్పెషల్ వీడియో విడుదల చేసి, ఎనౌన్స్ చేశారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది.