ఈ శుక్రవారం థియేటర్లలో సందడి చెయ్యడానికి ముస్తాబవుతున్న చిత్రాలలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన "అమిగోస్" ఒకటి. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంతో హీరోయిన్ అషికా రంగనాథ్ టాలీవుడ్ డిబట్ చేస్తుంది. ఘిబ్రాన్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో నిన్నే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా జరుపుకున్న అమిగోస్ మూవీ తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం నుండి అమిగోస్ యూ/ ఏ సర్టిఫికెట్ పొందింది.