అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ ప్రధానపాత్రల్లో నటిస్తున్న చిత్రం "సెల్ఫీ". రాజ్ మెహతా డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాకు అజీమ్ దయాని సంగీతం అందిస్తున్నారు. నుష్రత్ భారుచ్చ, డయానా పేంటీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. సూపర్ స్టార్ అక్షయ కుమార్ తో ఆయన వీరాభిమాని సెల్ఫీ కోసం చేసే పోరాటమే ఈ సినిమా. ఇటీవల విడుదలైన ట్రైలర్ కి ఆడియన్స్ నుండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది.
తాజాగా ఈ సినిమా నుండి లిరికల్ అప్డేట్ వచ్చింది. కుడియీ ని తేరి ..అని సాగే పాటను రేపు విడుదల చెయ్యబోతున్నట్టు పేర్కొంటూ సాంగ్ ప్రోమోను విడుదల చేసారు మేకర్స్. ఈ పాట అక్షయ్, మృణాల్ ల మధ్య ఉండే బ్యూటిఫుల్ అండ్ ఎలక్ట్రిఫయింగ్ సాంగ్ గా ఉండబోతుందని తెలుస్తుంది.
పోతే, ఈ మూవీ ఫిబ్రవరి 24వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa