నాగశౌర్య, మాళవికా నాయర్ జంటగా నటిస్తున్న చిత్రం "ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి". నటుడు, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల గారు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. రీసెంట్గానే ఫస్ట్ లుక్ విడుదలయ్యింది.
లేటెస్ట్ ఈ సినిమా నుండి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మేరకు మరో రెండ్రోజుల్లో అంటే ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి టీజర్ విడుదల కాబోతుందని తెలుస్తుంది. ఈ మేరకు కాసేపటి క్రితమే అఫీషియల్ పోస్టర్ విడుదలయ్యింది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa