మరో రెండ్రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్న అమిగోస్ మూవీ నుండి కాసేపటి క్రితమే ఒక స్పెషల్ వీడియో విడుదలైంది. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మంజునాథ్, సిద్దార్థ్, ఒక అన్ నోన్ .. ఇలా మూడు పాత్రల్లో త్రిపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే కదా. ఈ నేపథ్యంలో మంజునాథ్ పాత్రను విశదీకరిస్తూ కళ్యాణ్ రామ్ ఒక వీడియోను చేసారు. మంజునాథ్ చాలా మంచివాడు. మృదుస్వభావి. ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్ అని.. చాలా మటుకు ఈ పాత్ర తన నిజ జీవిత పాత్రను పోలి ఉంటుందని కళ్యాణ్ రామ్ పేర్కొన్నారు.
రాజేంద్రరెడ్డి డైరెక్షన్లో ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందిన ఈ సినిమాలో అషికా రంగనాథ్ హీరోయిన్ గా నటించింది. ఘిబ్రాన్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa