యంగ్ హీరో విశ్వక్ సేన్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "ధమాకా". ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ గా విడుదలైన ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల సాంగ్ యువతకు విపరీతంగా నచ్చేసింది. ఈ పాటపై రీల్స్ చేస్తూ యూత్ సోషల్ మీడియాలో చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. నెలక్రితం విడుదలైన ఈ పాట ఇప్పటికీ యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోస్ 19 మిలియన్ వ్యూస్ తో ట్రెండ్ అవుతుండడం విశేషం. విశ్వక్, నివేదా కలిసి బీచ్ ఒడ్డున పాడుకునే ఈ రొమాంటిక్ లవ్ సాంగ్ ను లియోన్ జేమ్స్ స్వరపరచగా, ఆదిత్య RK పాడారు. పూర్ణాచారి లిరిక్స్ అందించారు.
విశ్వక్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను ఆయనే డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ఈనెల 17న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో విడుదల కావలసి ఉండగా, వాయిదా పడింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa