సిద్ధార్థ్ హీరోగా నటించిన సినిమా 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా'. ఈ సినిమాలో హీరోయినిగా త్రిష నటించింది. ఈ సినిమాకి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీహరి కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా 2005 జనవరి 14న విడుదలై ఘన విజయం సాధించింది.ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ ఇచ్చిన సంగీతం జనాలను బాగా ఆకట్టుకుంది. అయితే తాజాగా ఈ సినిమా మరోసారి రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లో రీరిలీజ్ కానుంది.